
నెల్లూరు టౌన్ హాల్లో నగర జనసేన క్రీయాశీలక సభ్యులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరైతే మొట్ట మొదటి నుంచి పనిచేసిన కార్యకర్తలు ఉన్నారో అందర్నీ కూడా పిలిచి నెల్లూరు జనసేన పార్టీ నాయకులు టోని బాబు గారు సమావేశం ఏర్పరిచారు. గత వారం పవన్ కళ్యాణ్ గారితో ఒంగోలులో కలిసి మాట్లాడిన విషయాలు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం అందరిని కూడా కలిసి పని చేయాలని, ఇకమీదట జనసేన పార్టీలో అవకతవకలు జరగకూడదని, అందరం కలసి సమిష్టిగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని బలంగా కార్యక్రమాలు చేయాలని కోరారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచికంటి శ్యామ్, ప్రవీణ్ యాదవ్, శ్రీపతి రాము, కోలా విజయలక్ష్మి, షానవాజ్, గుడ్లూరు నాగరత్నం, పాప మురళి, శ్రీనివాసులు భాను ప్రకాష్, చెరుకూరి సుబ్బు, శ్రీను, డ్రైవర్ శ్రీను తదితర జనసైనికులు పాల్గొన్నారు.