
మడకశిర నియోజకవర్గం రత్నగిరి గ్రామంలో ఉన్న జనసైనికుల ఆధ్వర్యంలో రత్నగిరి పంచాయితీ ఎన్నికలకు అభ్యర్థి కోసం చర్చించడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి గత 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న టిడిపి నాయకుడు మంజన్న జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకుల మడకశిర యశ్వంత్ రాయల్ మరియు రోళ్ళ మండలం ZPTC అభ్యర్థి రంగస్వామి చేతుల మీదుగా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే రత్నగిరి గ్రామం సర్పంచు ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసేందుకు మంజన్నను జనసైనికులందరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టింది ప్రజల్లో మార్పు రావాలని ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ రావాలని తెలిపారు. అలాగే ఎలాంటి సందర్భంలోను పార్టీ విడనాడనని చెప్పారు. జనసేన పార్టీ ఉన్నంతకాలం పార్టీలో ఉంటానని చెప్పారు. జనసేన నాయకులు రంగస్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అలాగే పార్టీ బలోపేతం గూర్చి దృష్టి పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి గోపి, హరీష్, ప్రతాప్, సతీష్, రవి, జగదీష్, దిలీప్, మారుతి, లోకేష్, తిమ్మరాజు, యంజేరి, ముఫీజ్, కుమార్ తదితర జనసైనికులు అందరూ పాల్గొన్నారు.