
యువతను భవిష్యత్తు నాయకులుగా రూపు దిద్దడం జనసేన ఆశయాలలో ముఖ్యమైన అంశం అని నియోజకవర్గం ఇంచార్జి యుగంధర్ పొన్న అన్నారు. వెదురు కుప్పం మండలం భారతం మిట్టలో పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతు గ్రామ స్వరాజ్యంతోనే పల్లెలు సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని మహాత్మాగాంధీ ఎంతో దూరదృష్టితో చెప్పిన మాటలు అనేక సందర్భాల్లో నిజమని నిరూపించారు అని తెలిపారు. పటిష్టమైన నాయకత్వం చేతిలో ఉన్న గ్రామాలు అభివవృద్ధి ఫలాలను అనుభవిస్తున్నాయి. చక్కని రోడ్లు, ఆధునిక పద్ధతుల్లో మురుగునీటి పారుదల వ్యవస్థ, ఆరోగ్య కరమైన మంచి నీరు, పౌరవసతులు సమకూర్చడం మనం చూస్తూనే ఉన్నాము. మీడియా లో వస్తున్న అనేక కథనాలను చదువుతూనే ఉన్నాము. మన గ్రామాలను అభివృద్ధి చేసుకునే ఒక గొప్ప అవకాశం ఆంధ్రప్రదేశ్ లో రాబోతుంది. సుమారు 12000 పై చిలుకు పంచాయతీ లకు ఫిబ్రవరి లో ఎన్నికలు జరుగబోతున్నాయి. 18 నుండి 19 వయస్సు వారు 5, 39, 804 మంది, 18 నుండి 35 వయస్సు వారు 68 లక్షల మంది, 18నుండి 45 వయస్సు వారు 1 కోటి 8 లక్షలు మంది యువ ఓటర్ లు ఉన్నారు. అయితే పంచాయతీ పాలనను సుపరిపాలనగా మార్చాలంటే యువత ముందుకు కదలాలి. పంచాయతీ ల ప్రగతికి దిశా నిర్దేశం చేసి సుపలమైన ఫలితాలు సాధించగలిగిన శక్తి సామర్ధ్యాలు ఆంధ్రప్రదేశ్ లోని యువతలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే నిధులు సద్వినియోగం కావాలంటే పంచాయతీ లో యువత భాగస్వామ్యం ఎంతైనా అవసరం అని తెలిపారు. ఈ ఎన్నికల్లో యువత కీలకమైన పాత్ర పోషించాలని కోరుతున్నాను. మన గ్రామాలను, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్న ఆలోచనలు ఉన్న యువతి, యువకులు ఇప్పుడు జరగ నున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. జనసేన పార్టి నుంచి మీకు సంపూర్ణ మైన మద్దతు అందచేస్తామని హామీ చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు పురుషోత్తం, ప్రధాన కార్యదర్శి సతీష్, మీడియా విభాగం ఇంచార్జి వెంకటేష్, సమన్వయ కర్తలు యతీశ్వర్ రెడ్డి,మధు, భాను చందర్ రెడ్డి, పాలసముద్రం మండల అధ్యక్షులు రాజ రత్నం రాజు, నాయకులు యువరాజ్, భాను ప్రకాష్, రాజేంద్ర, విశ్వనాధ్, పొన్నెయ్య, గుణ శేఖర్, ముని, శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.