
ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు కీ.శే. వెంగయ్య నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని విజయనగరం జనసేన పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం కోట జంక్షన్ వద్ద కొవ్వోత్తులు వెలిగించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు బాలు మాట్లాడుతూ ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాల్సిన ఓ బాధ్యత కలిగిన ఓ ఎమ్మెల్యేను అభివృద్ధి కోసం ప్రశ్నించిన జనసైనికుడును పరుషపదజాలంతో దూషించడం అప్రజాస్వామికమని, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జనసైనికుడు వెంగయ్య నాయుడు ఆత్మహత్య కు కారణమైన గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు పై కేసు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్, ఏంటి రాజేష్,రవిరాజ్ చౌదరి, తాతపూడి రామకృష్ణ గారు, బూర్లీ వాసు,పవన్ కుమార్,యాగాటి నలమరాజు, రెయ్యి రాజు, వెంకటేశ్వరవు,చందక బుజ్జి, పి.వి.ఎస్. మూర్తి,శ్రీనివాస్, భవాని పాల్గొన్నారు.