88 వ వార్డు గాజువాక నియోజకవర్గం సీనియర్ నాయకులు తనుగుద్ధి రామారావు గారి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఎంపిక ప్రక్రియలో క్రియాశీలక ఐడీ తీసుకునే వ్యక్తి నిర్ణయించే ప్రక్రియలో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ అభ్యర్థి వబ్బిన జనార్దన శ్రీకాంత్ గారు మాట్లాడుతూ మనమందరము ఏకతాటిపై క్రియాశీలక ఐడి స్వీకరించిన వ్యక్తి కి సహకరించి ఎక్కువమంది క్రియాశీలక సభ్యులు గుర్తించడం ఒక పండగ వాతావరణంలో జరగాలని, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు కార్యకర్తలకి భరోసా ఇచ్చే విధంగా ఉంటాయనడానికి నిదర్శనం ఈ క్రియాశీలక సభ్యులు ఎంపిక ప్రక్రియ అని, క్రియాశీల సభ్యులకు అనుకోకుండా యాక్సిడెంట్ కు గురై అయితే హాస్పిటల్ ఖర్చులు నిమిత్తం 50 వేలు, కార్యకర్తను కోల్పోతే కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. కార్యకర్త కోసమే ఇంత ఆలోచిస్తే రేపు ప్రజలు ఓటేసి జనసేన పార్టీ ప్రభుత్వ ఏర్పడితే ప్రజలకోసం అధ్యక్షులు ఇంకెంత ఆలోచిస్తారు అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని, ఈ క్రియాశీలక ఐడి స్వీకరించిన వ్యక్తి ఒక బాధ్యతతో అందర్నీ కలుపుకొని మన వార్డులో మిగతా వాటికన్నా ఎక్కువ క్రియాశీలక సభ్యులు గుర్తించే విధంగా ప్రయత్నం చేయాలని కోరడం జరిగింది. యాదవ్ జగ్గరాజు పేట గ్రామానికి చెందిన చందక చిన్నారావు గారికి క్రియాశీలక ఐడి ఇవ్వడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది, ఇదే విషయాన్ని గాజువాక నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ కోన తాతారావు గారి దృష్టికి తీసుకుని వెళ్లి, రానున్న రోజుల్లో జనసేన నాయకత్వాన్ని బలపరిచే విధంగా సమిష్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గాజువాక పెద్దలు మూర్తి గారు, శ్రీకాంత్ గారు, కాపు జగ్గరాజు పేట రమేష్ గారు, యాదవ జగ్గరాజు పేట బోట్ట రాజు గారు, చలం, అశోక్, మంగళ పాలెం హనుమంతరావు గారు, సిరసపల్లి అప్పారావు గారు, మల్లేష్ గారు, దువ్వాడ మురళి, మహేష్, సురేష్, సూర్యనారాయణ, త్రినాధ్ సత్యనారాయణ మరియు జనసైనికులు పాల్గొన్నారు.