కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలలో రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కాలనీలు ఏర్పాటు అయ్యి ఏళ్ళు గడుస్తున్న నిరుపేదలు నివాసం ఉండే కాలనీలలో రోడ్లు వెయ్యకుండా ప్రభుత్వాలు, అధికారులు మారిపోతున్నారు. క్రొత్త ప్రభుత్వాలు, అధికారులు వస్తున్నారుగానీ కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు అయిన డ్రైనేజీలు గానీ, సరి అయిన రోడ్లు గానీ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని జనసేన నాయకులురాయపూడి వేణుగోపాల రావు అన్నారు. ముఖ్యంగా సింహాద్రి కాలనీ, మండలిపురం, BC కాలనీ, సూగాలి కాలనీ, లంకమ్మ మాన్యం, రాజశేఖర్ పురం, వివర్స్ కాలనీలు ఏర్పాటు అయ్యి చాలా ఏళ్ళు అయ్యింది. ఈ నాటిటికి ఈ కాలనీలలో డ్రైనేజీలు లేవు. జనసేన పార్టీ తరుపున ఈ కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించండి అనీ 6 ఏళ్ళ నుండి పోరాటాలు చేస్తున్నాము. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడ పట్టించుకోవటం లేదని అన్నారు. ఇలాగే ఉంటే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని అన్నారు. ఈ ఈ కార్యక్రమంలో స్థానికులు లంక వెంకటరావమ్మ (నల్లమ్మ ), ముడపాక వల్లి లక్ష్మి, ఆ. లక్ష్మీపార్వతి,ఆ. విజయలక్ష్మి, తోట విజయలక్ష్మి, G. శ్రీను, మత్తి సుబ్రహ్మణ్యం, పప్పుశెట్టి శ్రీనివాస్, నాగరాజు, చందు, తదితరులు పాల్గొన్నారు.