పేదలకు 20 వేల రూపాయల నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు

                విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం ఎల్.కోట మండలం కొట్యాడ గ్రామంలో నేనుసైతం సేవ సంగమ్ శ్రీ జొన్నపల్లి శివాజీ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్బంగా నిర్వహించిన కార్యక్రమం లో గ్రామంలో పేదలకు 20 వేలు రూపాయలు నిత్యావసర సామగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున ముఖ్య అతిధిగా నియోజకవర్గం నాయకులు శ్రీ వబ్బిన సతీష్ గారు చేతుల మీదుగా అందించటం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడో ఏదో జరిగినప్పుడు కాకుండా శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని గత ఆరు ఏళ్ళగా ప్రతీ ఏడాది కూడా సంక్రాంతి రోజున ఇటువంటి కార్యక్రమం చెయ్యటం సంతోషకరం. యువత అంతా కూడా దీనిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

See also  పెన్షన్ తొలగిస్తామని నోటీసులు ఇచ్చిన బాధితుల తరుపున జనసేనపార్టీ నిరసన కార్యక్రమం