ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్ట పోయిన రైతులకు పరిహారం అందించడములో ప్రభుత్వం విఫలమయ్యినదని సోమవారం కాకినాడ లో జరిగిన పత్రికా సమావేశం లో పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇంచార్జి మాకినీడి శేషుకుమారి తెలిపారు. ఈ సందర్బంగా శేషుకుమారి మాట్లాడుచూ తూర్పుగోదావరి జిల్లాలో పంటలు పండించే రైతన్నలు అధిక శాతం ఉన్నారని, రైతులు పడుతున్న కష్టాలు జనసేన ఎప్పటి కప్పుడు ప్రభుత్వానికి తెలుపుచూ, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకొనక పోవుట రైతులపై ప్రభుత్వానికి వున్న చిత్త శుద్ధి ఏపాటిదో అర్థమగుచున్నదని తెలిపారు. మాకు అత్యధిక సీట్లు ఉన్నాయి కదా అని మేము ఏం చేసినా సరిపోతుంది అని అనుకుంటున్నారని, కానీ ప్రజలు అన్నీ చూస్తున్నారని శేషుకుమారి తెలిపారు. ఈ సమావేశములో PAC సభ్యులు పంతం నానాజీ మాట్లాడుచూ ఇప్పుడు ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కి మంచి సబ్జెక్ట్ ఉంది అవగాహన ఉందని, జర్నలిజంలో కూడా నెంబర్ వన్ అనిపించుకున్న వ్యక్తి ఇప్పుడు ఈరోజు రైతుల విషయంలో విఫలం అయ్యారని అనుట నూటికి నూరుపాళ్ళు నిజం అని అన్నారు. ఈరోజు ప్రభుత్వం ఇళ్ల స్థల పట్టాలు మంజూరు చేయుట మంచి పనే కానీ వాటిని అర్హులకు, పేదవాళ్ళకి అందేలా చేయాలని, యింటి స్థల పట్టాలు శాంక్షను చేయుటలో వై ఎస్ అర్ పార్టీ చోటా నాయకులు అవినీతి కి పాల్పడు చున్నారని అన్నారు. ఈ సందర్బంగా అర్హులు అయిన వారికి ప్రభుత్వం యింటి స్థల పట్టాలు మంజూరు చేయక పోయిన, అనర్హులకు పట్టాలు మంజూరు చేసిన, లేదా యిండ్ల స్థలాలు యిప్పించుటకు ఎవరైనా అవినీతికి పాల్పడిన వాటి వివరాలు జనసైనికులు గుర్తించి, ఆ వివరాలు తెలుపవలసినదిగా జనసైనికులకు సూచించారు. ఈ సమావేశం లో జనసేన ప్రతినిధులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.