అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తూ దేశం మొత్తం అన్ని మతాల వారు ఆనందంగా అన్నదమ్ముల్లా ఉండాల్సిన ఈ సమయంలో కేవలం హిందువులను రెచ్చగొట్టే విధంగా రామతీర్థం రాముని విగ్రహం శిరస్సును నరికిన దుర్మార్గులను త్వరగా గుర్తించి, కఠినంగా శిక్షించాలని జనసేన పార్టీ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) అన్నారు. రామతీర్థం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్లకార్డులతో పాదయాత్ర చేస్తూ, కొండపైన రామునికోవెల వద్ద మోకాళ్ళ మీద కూర్చుని ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు బాలు మాట్లాడుతూ హిందూ దేవాలయాలు, విగ్రహల పై దాడులు చేసినవారిని వెంటనే గుర్తించి, దోషులను కఠినంగా శిక్షించాలని, ఈ దాడులపై జిల్లాలో వైస్సార్సీపీ నాయకుల నిర్లక్ష్య వైఖిరి విడనాడాలని అన్నారు. మరో జనసేన నాయకులు శ్రీ వంక నరసింగరావు గారు మాట్లాడుతూ వివిధ ప్రాంతాల్లో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులనుండి శాశ్వత పరిస్కారం చూపించాలని, ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుటినుంచి హిందూ దేవాలయాలపై దాడులు అధికం అయ్యాయని, ఈ మతలబు వెనుక ఏదో దుష్టశక్తులు పనిచేస్తున్నాయని త్వరలో వీటన్నింటికి శాశ్వత పరిష్కారం చేయాలని హెచ్చరించారు. అనంతరం రామతీర్థం కొండదిగువన బీజేపీ నాయకులు ఎన్. వి.ఆర్. ఈశ్వరరావు దోషులు దొరికేవరకు చేస్తున్న నిరాహారదీక్షకు జనసేన నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు లోపింటి కళ్యాణ్, బి.వాసు, రెయ్యి రాజు, నిడుగొట్టి శ్రీను, పావాడ సాయి, పి.అనిల్, బెల్లాన చక్రి, పిల్లి సతీష్, నల్లపాటి సాయి ప్రకాష్, పురుషోత్తం, వినయ్, తవిటి నాయుడు, బీజేపీ నాయకులు తాడి నానాజీ గారు పాల్గొన్నారు.