జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను విమర్శించే అర్హత వైసీపీ ముఖ్యమంత్రికి గాని లేదు. రైతుల కోసం జనసేన అధ్యక్షుడు పోరాడుతుంటే వైసీపీ మంత్రులు ఆళ్లనాని, పేర్ని నానీలు విమర్శలు చేస్తున్నారు. రూ. 937 కోట్లు ఇన్‌పుట్ సబ్సీడిని రిలీజ్ చేస్తామని తర్వాత మాట మార్చి 637 కోట్లు మాత్రమే ఇస్తున్నారన్నారు. రైతులకు వెంటనే పంట నస్ట పరిహారం, పంటల, భీమా ఇవ్వకపోతే అసెంబ్లీని ముట్టడి స్తామని జనసేన PAC నభ్యులు చిలకం మధుసూధన్‌రెడ్డి, రాయలసీమ సంయుక్త కన్వీనర్ టిసి వరుణ్‌లు పేర్కొ న్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా చిలకం మధుసూధన్‌రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో రాష్ట్రంలో 17 లక్షల మంది రైతులు నష్టపోయారని వారే మొదట చెప్పడం జరిగిందన్నారు. తర్వాత క్యాబినెట్‌లో 13 లక్షల మంది రైతులు అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయారని చెప్పడం జరిగిందన్నారు. తర్వాత అసెంబ్లీలో 11 లక్షల మంది రైతులు పంట దెబ్బతినిందని లెక్కలు తేల్చారని ఒక్కొసారి ఒక్కొ మాట’ “మాట్లాడటం చేస్తుంటే రైతుల పట్ల వీరికి ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందన్నారు. వైసీపీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్లి తమకు సహాయం చేయాలని ప్రధానిని కోరి తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చినపుడు సహాయం చేయలేదని విమర్శించడం తగదన్నారు. రాయలసీమ సంయుక్త కన్వీ నర్ టి.సి.వరుణ్ మాట్లాడుతూ… పేర్నినాని, కొడాలి నానిలు మాట తీరు సరిగ్గా లేదని మాటలు సరిగా మాట్లాడకపోతే తాము కూడా బూతు పదాలు జగన్‌మోహన్‌రెడ్డి, మీపై మాట్లాడాల్సి వస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తారని తమ నాయకుడు ఏ రోజు కూడా కోర్టుకుకానీ, జైలుకు గాని వెళ్లలేదని ఎటువంటి అవినీతి అక్రమాలకు చోటివ్వరని నీతి నిజాయితీకి మారుపేరు పవన్‌కళ్యాణ్ అన్నారు. ఒకప్పుడు లారీ క్లీనర్‌గా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే అయి, మంత్రి అయి విపక్షాలపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. ఆయన టీ కప్పులు అందించిన విషయాన్ని మరిచిపోయారా గుర్తు చేసుకోవాలన్నారు. ఎప్పుడు ప్రజల పక్షోన పోరాడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. గతలో 2014 సంవత్సరంలో టీడీపీ పార్టీని గెలిపించిన వ్యక్తి పవన్‌కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర౦లో ప్రజాదారణ ఉన్న ఏకైక వ్యక్తి పవన్‌కళ్యాణ్ అన్నారు. వైసీపీ నాయకులంతా దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు చేసేది తమ నాయకుడికి రాదని, సినిమాల్లో నటిస్తే తప్పా… అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బాబు రావు జయరామిరెడ్డి, మురళీ, ధనుంజయ్, ఈశ్వర్, కిరణ్, సాకే మురళీ, విజయ్, కృష్ణ, వెంకటనారాయణ, విశ్వనాథ్, రాజు, హుస్సేన్, హరీష్, శేషాద్రి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.