
ప్రతి పల్లెకు జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించి విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నియోజకవర్గంలోని శోభనాపురం గ్రామాన్ని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఓట్లు కోసం నోటికి వచ్చిన హామీలు ఇచ్చిరెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఎమ్మెల్యే గారు శోభనాపురం గ్రామం వైపు చూడలేదు. 50 ఏళ్ళగా కనీసం మాకు తాగటానికి గుక్కెడు మంచి నీళ్లు ఇప్పించండి అంటూ అలాగే గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామస్తులు అందరూ ఏకమై శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలానికి ఆకర్షితులై, పవన్ కళ్యాణ్ గారే మన సమస్యలు పరిష్కరిస్తారు అనే నమ్మకం తో పాతపట్నం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ గేదెల చైతన్య గారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలంతా జనసేన పార్టీలో చేరడం జరిగింది. శ్రీ గేదెల చైతన్య గారు సహృదయంతో స్పందించి వెంటనే సమస్య పరిష్కారనికి అండగా నిలిచి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.