రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు : బాపట్ల జనసేన నాయకులు
2 రోజుల క్రితం అనంతపురం జిల్లా ధర్మవరం మండలం లో రాక్షసుల చేతిలో బలైన అమ్మాయి. ప్రచార ఆర్భాటాలతో పరిమితమైన చట్టాలు. ఒక మహిళ హోం మంత్రిగా పనిచేస్తున్న ఇలాంటి సంఘటన జరగడం మన దౌర్భాగ్యం. నేను ఉన్నాను నేను విన్నాను అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ ఏ ఒక్క మహిళ కు అన్యాయం జరగనివ్వం అంటూ దిశా చట్టం చేసిన ఈ ప్రభుత్వానికి మహిళల పై జరుగుతున్న అగత్యం పై దిశ చట్టం ఏమాత్రం పనిచేయట్లేదు. అంటే ప్రభుత్వం మహిళలపై ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుందో తెలుస్తుంది . ఇప్పటికైనా కళ్లు తెరిచి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు మరియు హోమ్ మంత్రి సుచరిత గారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. దిశ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.రాష్ట్రంలో ఇలాంటి దుర్ఘటనలు మరలా జరక్కుండా తగిన చర్యలు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాపట్ల నియోజకవర్గం జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక నాయకులు నామన శివన్నారాయణ, పట్టణ క్రియాశీలక నాయకులు కొట్రా మణికంఠ, ఉసా ప్రసాద్, పిట్టలవానిపాలెం, మండల క్రియాశీలక నాయకులు, మలిశెట్టి వెంకట గోపి మరియు జనసైనికులు పర్వతరెడ్డి యలమంద కొట్రా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.