“చిన్ని చిన్ని తాయిలాలు – పెద్ద పెద్ద పన్నులు” : జనసేన ఏలూరు ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు

“చిన్ని చిన్ని తాయిలాలు – పెద్ద పెద్ద పన్నులు” : జనసేన ఏలూరు ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు

                         రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఈ 18 నెలల్లో అవసరం ఉన్నా లేకపోయినా ప్రజలకు సంక్షేమ పథకాలు రూపాల్లో తాయిలాలు పంచుతూ మరోపక్క ప్రజలనుంచి పన్నుల రూపంలో విపరీతమైన దోపిడీని చేస్తోంది. ఒక చేతితో రూపాయి ఇస్తూ మరో చేతితో పది రూపాయలు లాక్కొనే ప్రయత్నం చేస్తోంది. దీనిని మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు ప్రతి ఒక్కరూ గమనించి ఖండించాల్సిన అవసరం ఉంది అని అప్పలనాయుడు గారు తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట అనేక తాయిలాలు పంచడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో బయట నుంచి అప్పు తెచ్చుకొనే అవకాశం లేకపోవడంతో ప్రజల మీద విపరీతంగా పన్నులు వేయడం అనేది ప్రస్తుత ప్రభుత్వం చేస్తోంది. సామాన్య ప్రజలు వాడే నిత్యావసర వస్తువుల ధరలు నుంచి ఇళ్ల పన్నులు వరకు ప్రతి ఒక్క దానిని పెంచుకుంటూ పోతుంది ఈ ప్రభుత్వం. రోడ్ టాక్స్, టోల్ టాక్స్, పెట్రో టాక్స్, కరెంటు చార్జీలు… ఒక్కటేమిటి అవకాశమున్న ప్రతిదానిమీదా వివిధ రూపాలలో పన్నులను విపరీతంగా పెంచి సామాన్యులను దోచుకుంటోంది. అయితే ఆ దోపిడీకి తగ్గ అభివృద్ధి మాత్రం రాష్ట్రంలో ఎక్కడ జరగట్లేదు అనేది నిర్వివాదం అంటూ ఆయన తెలిపారు. పల్లెల్లో పట్టణాల్లో నివసించే ప్రతి ప్రజానీకానికి సంబంధించి వారు నివసించే ఇళ్లపై ఆస్తి పన్నులను విపరీతంగా పెంచే ఆలోచనలో ప్రస్తుతం ఈ ప్రభుత్వం 180 నెం. జీవో ను తీసుకువచ్చింది. ఈ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలను ఇరుకునబెట్టి, అడ్డులేకుండా చేసుకుని తను ప్రతిపాదించిన బిల్లులను ఆమోదింప చేసుకుంటోంది. అయితే ఈ బిల్లు మండలిలో వీగి పోవడంతో ప్రస్తుతానికి ఆగినా మరో రూపంలో అయినా ఈ బిల్లును తీసుకువచ్చి ఆస్తి పన్నులు పెంపు చేసే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తోంది.  ఇప్పటివరకు ఈ ఆస్తి పన్నులను రెంటల్ వాల్యూస్ మీద అంటే మనకున్న స్థలంపై గాని, భవనాలపై గాని సంవత్సరానికి వచ్చే అద్దె విలువ మీద దీనిని నిర్ణయించేవారు. అయితే ప్రస్తుతం దీనిని క్యాపిటల్ వాల్యూ మీద నిర్ణయించి అమలు చేసే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఆర్డినెన్సును తయారు చేసింది.

                  క్యాపిటల్ వ్యాల్యూ అంటే రిజిస్టర్ ఆఫీసులో ప్రస్తుతం ఉన్న స్థలం యొక్క విలువ అందులో ఉన్న భవనం యొక్క విలువను తీసుకొని దానిమీద పన్నును నిర్ణయించడంతో ఆస్తి పన్ను విపరీతంగా పెరిగిపోతుంది. పైగా ప్రతి సంవత్సరం రిజిస్టర్ ఆఫీసులలో ఈ క్యాపిటల్ వాల్యూను పెంచడం జరగటం వల్ల ఆస్తి పన్ను కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఇది సామాన్యులకు పెనుభారంగా మారుతుంది. దీనిని ప్రతి ఒక్కరు గమనించ వలసిన అవసరం ఉంది.  ఇలాగే మోటారు వాహన చట్టంలో జీవో నెంబర్ 21 నితీసుకు వచ్చి విపరీతమైన టాక్స్ లను, పెనాల్టీలను పెంచి వసూలు చేయడం ద్వారా ఆటో, టాక్సీల వారి మీద పెను భారం మోపడం జరిగింది. ఒకవైపు ఆటో వారికి 10వేల రూపాయలు ఇస్తున్నట్లుగా చూపిస్తూ మరోవైపు ఈ పెనాల్టీల ద్వారా 30,40 వేల రూపాయలను వసూలు చేస్తుంది. అంతేకాకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు అండగా నిలవాల్సిన ఈ ప్రభుత్వం ఒకవైపు బోర్లు ఉచితంగా వేస్తామని చెబుతూ దానికి సంబంధించిన మోటర్లకు మీటర్లు బిగించే ఆలోచన చేయడం చాలా దారుణం అనీ పోనుపోను మాములుగా రోడ్లపై నడవడానికి కూడా పన్నులు వేసే దోరణి కనిపిస్తోందనీ., ప్రభుత్వం తీసుకువచ్చిన ఇలాంటి జీవో లను వెనక్కి తీసుకోకపోతే జనసేన పార్టీ ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని అప్పలనాయుడు తెలియజేశారు.
                     ఈ నెల 25న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ అంటూ చేపుతూనే 20,30 సంవత్సరాల క్రితం ఇచ్చిన డి ఫారం పట్టా భూముల్లో 50 గజాల స్థలంలో కూడా ప్లాన్లు పెట్టుకోవాలని చెబుతూ వారికున్న వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అక్రమ నోటీసులు ఇస్తూ, అప్పులు చేసి కట్టుకున్న ఇళ్లను కూలుస్తామని బెదిరిస్తూ స్థానిక నాయకులు పేదల దగ్గర డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు డిప్యూటీ సీఎం అయిన ఆళ్ల నాని గారి ప్రాంతంలో ఇలా జరుగుతుండడం ఆయన గమనించుకుని దానిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇలా పేదల ఉసురు తీసుకున్న గత ప్రభుత్వాలు ఎలా అయితే కనుమరుగయ్యాయో ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి రెడ్డి అప్పలనాయుడు హెచ్చరించారు. స్థానిక జనసేన పార్టీ ఇన్చార్జి ఆఫీస్ నందు జరిగిన ఈ విలేకరుల సమావేశంలో నగరకమిటీ అధ్యక్షుడు కాశీనరేశ్, మండల కమిటీ అధ్యక్షుడు వీరంకి పండు, సరిది రాజేష్, ధర్మేంద్ర, బొత్సా మధు, అల్లు చరణ్, గిరిజాకుమారి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way