
విశాఖలో కోవిడ్ – 19 అవగాహన పై ప్రత్యేక సదస్సు : ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ
విశాఖలో కోవిడ్ – 19 అవగాహన పై వివిధ వర్గాల వారిని భాగస్వామ్యం చేస్తూ నిర్వహిస్తున్న ప్రత్యేక సదస్సులలో భాగంగా సెయింట్ ఆన్స్ కళాశాలలో జాతీయ సేవా పధకం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ పశ్చిమ నియోజక వర్గ నాయకులు శ్రీ పీలా రామకృష్ణ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్ళినపుడు తప్పనిసరిగా మాస్కూలు ధరించాలని, తరుచుగా శానిటైజర్ కూడా వాడాలని కోరారు. భా.జ.పా 62వ వార్డు కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ ములకపల్లి ప్రకాష్, 60 వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ మోజాడ చంద్రమౌళి, 61 జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధులు శ్రీమతి నోట్ల రామచంద్రకళ, 40 వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ కఠంరెడ్డి శివశంకర్, 58 వ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీమతి అంగ ప్రశాంతి,భా.జ.పా. 60 వ వార్డు అధ్యక్షులు శ్రీ పి. మన్మధ రావు, భా.జ.పా నాయకులు శ్రీ ఎం.నూకరాజు, శ్రీ ఎ.దేముడు, భా.జ.పా.నాయకురాలు శ్రీమతి వసుంధర, జనసేన నాయకులు ఎమ్.నగేష్, ఎమ్.సత్తిబాబు, ఎమ్.ధర్మెంద్ర, డి.ఎమ్.రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జాతీయ సేవా పధకం ప్రోగ్రాం అధికారి వై.అనసూయా దేవి అధ్యక్షత వహించగా, జిల్లా ప్రోగ్రాం అధికారి ఇ.పి.ఎస్. భాగ్యలక్ష్మి సమావేశాన్ని సమన్వయపరిచారు.