Search
Close this search box.
Search
Close this search box.

sekhar

 

Name : Darlapudi Venkatesh
Designation : Reporter

Place : Amalapuram
Emp Code : 2020036
Valid Upto : 31 Dec 2024

One Response

  1. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని వేల్పూరు గ్రామంలో ప్రక్రృతి వ్యవసాయ విధి విధానాలు తెలుసుకునేందుకు మంగళవారం పంజాబ్ నుంచి రైతుల బ్రృందం రావడం జరిగింది ప్రక్రృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వై.నూకరాజు ఆధ్వర్యంలో డిప్యుటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సి.హెచ్.శ్రీనివాసులు, క్రృష్ట్నారావు ఆర్.పి.సి. ఎన్.ఆర్వో. విశాఖ, నేచురల్ ఫామింగ్ అధికారి చంద్రబాబు, జిల్లా కో-ఆర్డినేటర్ అరుణకుమారి, జోనల్ కో-ఆర్డినేటర్ వెంకటరత్నం, రామచంద్రరాజు డి.పి.పి. తో ఈ బ్రృందం పలు గ్రామాలలో పర్యటించి పర్యటనలో చివరి రోజు వేల్పూరు గ్రామంలోని టేకి దుర్గాప్రసాద్ పండిస్తున్న ఫిష్ ప్యాడి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఒకే పొలంలో పలు రకాల పంటలు అనగా వరి, చేపలు, పండ్ల మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలు ప్రక్రృతి వ్యవసాయ విధానంలో రైతు పండిస్తున్న విధానాన్ని చూసి హర్షం వ్యక్తం చేసారు, అనంతరం అదే గ్రామానికి చెందిన ముత్యాల సత్తిరాజు గారి టెర్రస్ గార్డెన్ కి వెళ్ళడం జరిగింది ఆయన ప్రక్రృతి వ్యవసాయ విధానంలో పండిస్తున్న కూర గాయలు, ఆకు కూరలు పళ్ళ మొక్కలు చూసి కాళీగా ఉన్న డాబాల పైన ఈవిధంగా కూడా పండించవచ్చా అని ఆశ్చర్యపడ్డారు ఆయన నుంచి సమాచారాన్ని సేకరించుకుని వారి ప్రాంతాలలో ఈ పద్దతులు అవలంబించడానికి మీ అనుభవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు,
    అనంతరం కావలిపురం గ్రామంలో నున్న రాంబాబు పొలంవద్ద వేసిన 36 మోడల్, ఎవ్రివీక్ మనీ మోడల్ సందర్శించడం జరిగింది ఈ మోడల్ లో పండ్ల మొక్కలు, పూలమొక్కలు, ఆకు కూరలు, కూరగాలు,మొక్కజొన్న పంటలను పరిశీలించారు, అనంతరం కావలిపురం గ్రామ SHG మహిళలతో సమావేశమయ్యారు ప్రక్రృతి వ్యవసాయంలో మహిళల పాత్ర ఎంతవరకు ఉందని ఏవిధంగా పంటలకు అవసరమైన కషాయాలు,ఎగ్గోమినో యాసిడ్, బయోకల్చర్స్ ఏవిధంగా తయారు చేస్తారు స్వయం సహాయక సంఘాలు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని మహిళల ను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో తణుకు డివిజన్ ప్రక్రృతి వ్యవసాయ సిబ్బంది రైతులు, మహిళలు పాల్గున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way