• హర్షం వ్యక్తం చేస్తున్న బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మిట్ట రాజా
అనంతపురం, ఏప్రిల్ 16 (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ శిరోమ మండలనం కేసులో వైసిపి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు విశాఖ కోర్టు జైలు శిక్ష విదిచ్చింది. 18 నెలల జైలు శిక్షతోపాటు 2,50 లక్షల ఫైన్ విధించింది. తోట త్రిమూర్తులకి దళిత నాయకులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని దళిత నాయకులకి శిరోమండలం చేసి రెప్పలు కత్తిరించి చిత్ర హింసలు చేసినారు. దీనిపై దళిత నాయకులు 1994లో కోర్టులో కేసు పెట్టడం జరిగినది. 1998 లో కేసు కొట్టేయడం జరిగినది. పెద్ద ఎత్తున దళిత సంఘ నాయకులు ధర్నా చేపట్టడం జరిగినది. మరల హైకోర్టులో 2000 సంవత్సరంలో కేసు పెట్టగా 2012 నుంచి 2019 వరకు 146 వాయిదాలు జరిగినాయి. దళితులను హింసించిన, (వైసిపి ప్రభుత్వం మాత్రం) హక్కున చేర్చుకొని తోట త్రిమూర్తులుకి ఎమ్మెల్సీగా బాధ్యత ఇచ్చి దళితులను అవమానించిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసిపి ప్రభుత్వం మాత్రమే. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైసిపి ప్రభుత్వం. ఎమ్మెల్సీ మాత్రమే శిరోమండనం కేసులో 24 మంది సాక్షులు ఉండగా 11 మంది సాక్షులు మరణించారు. ఇన్ని మరణాలకు కారణమైన తోట త్రిమూర్తులుకి జైలు శిక్ష పడటం వల్ల యావత్ దళిత జాతి నాయకులు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ స్థానంపై నమ్మకం కుదరటమే కాదు భారత న్యాయ స్థానంపై అపూర్వ గౌరవం పెరిగిందని బిజెపి ఎస్సీమోర్చా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.