కూకట్ పల్లి, ఏప్రిల్ 13 (జనస్వరం) : హైదరాబాద్ BHEL గ్రౌండ్స్ లో జరిగిన శ్రీకృష్ణదేవరాయ కాపు యువసేన (SKDKY) వారు నిర్వహిస్తున్న ప్రైమరీ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో ముఖ్య అతిథిగా కూకట్ పల్లి నియోజక వర్గ జనసేన కంటెస్టెడ్ ఎంఎల్ఏ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ హజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రేమ కుమార్ ని SKDKY నిర్వాహకులు ప్రేమ కుమార్ ని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ శాంతి మరియు సోదరభావం మరియు జాతి నిర్మాణంలో సామాజిక పరస్పర చర్యను సులభతరం చేయడంలో, మంచి శరీరాన్ని మరియు మంచి మనస్సును కాపాడుకోవడంలో మానవ వ్యక్తిత్వాన్ని రూపొందించడంలో క్రీడలు ఒక ముఖ్యమైన అంశం అని అన్నారు. అనంతరం క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్, వేముల మహేష్, పులగం సుబ్బు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు .