• సమన్వయంతో ముందుకు వెళ్దాం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందాం.
• పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యం.
• కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేద్దాం.
• జనసేన సమన్వయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూటమి అభ్యర్థి దగ్గుబాటి వెంకట ప్రసాద్.
• కూటమి అధికారంలోకి రావాలంటే జనసేన పార్టీ ముఖ్య భూమిక పోషించాలన్న దగ్గుపాటి వెంకట ప్రసాద్.
• జనసేన సమన్వయ సమావేశంలో నాయకులు మహిళలు కార్యకర్తలు పునరుధ్ఘటన.
అనంతపురం, ఏప్రిల్ 07 (జనస్వరం) : ఆదివారం నాడు జనసేన పార్టీ శ్రేణులు అశోక్ నగర్ లోని ఒక ఫంక్షన్ హాలులో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత, జిల్లా ఉపాధ్యక్షుడు జయరామి రెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు గుండాల మురళి మాట్లాడుతూ పొత్తులో భాగంగా జనసేన పార్టీ అనంతపురం అర్బన్ టికెన్ జనసేనకే కేటాయిస్తారని మనమందరం అషించామని చివరి నిమిషంలో పొత్తుల ఎత్తుగడలలో బాగంగా టీడీపీ పార్టీకి కేటాయించారని.. మనకందరికి జనసేనకే టికెట్ రాలేదని కాసింత అసంతృప్తి ఉన్నప్పటికీ మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాటే మనకు శిరోధార్యమని మనమందరం సమన్వయంతో ముందుకువెళ్లి శక్తివంచన లేకుండా కృషి చేసి కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ ని ఘనమైన మెజారిటీతో గెలిపించు కుందామని మనందరి ఏకైక లక్ష్యం ఆశయం అవినీతి అరాచక వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించి ఆంధ్ర ప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దు కుందామని అన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయం చాలా గొప్పదని కూటమి అధికారంలోకి వచ్చేందుకు జనసేన పార్టీ ముఖ్య భూమిక పోషిస్తుందని అర్బన్ నియోజకవర్గంలో జనసేన శ్రేణులతో మమేకమై ప్రచారం చేస్తూ అనంత వెంకటరామిరెడ్డిని ఓడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి అంగడి చలపతి, ఎన్నికల నిర్వహణ రాయలసీమ కన్వీనర్ గల్లా హర్ష, జిల్లా కమిటీ సభ్యులు సంజీవ రాయుడు, కొన చంద్ర, జయమ్మ, నగర కమిటీ సభ్యులు జక్కిరెడ్డి ఆదినారాయణ, రోళ్ళ భాస్కర్, పెండ్యాల చక్రపాణి, కమతం వెంకట నారాయణ, ధారాజ్ బాషా, చోటు, విశ్వనాథ్, అంజి, హరి, వీరమహిళలు చంద్రకళ, గురు లక్ష్మి, పేరూరు మహాలక్ష్మి, అనసుయ, మధులిత,విజయ,కావేరి, యమున, గంగావతి, మునెమ్మ, జమున, ఎల్లమ్మ, కార్యనిర్వణ కమిటీ సభ్యులు రమణ, సాకే రవి కుమార్, దేవన సంతోష్, మధు, చిన్న, వెంకటేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.