విశాఖపట్నం, ఏప్రిల్ 05 (జనస్వరం) : విశాఖపట్నం ఓ ప్రైవేట్ హోటల్ లో బీజేపీ-టీడీపీ-జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వంగపల్లి గీత ఆధ్వర్యంలో 7 నియోజక వర్గాల కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు మరియు ముఖ్య నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రచార కార్యక్రమాల నిర్వహణ, ప్రజలో పార్టీ, అభ్యర్థి గుర్తుల సూచన, పార్టీలతో సమన్వయం వంటి అంశాల మీద దిశ నిర్దేశం చేశారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థుల, ముఖ్య నేతల సలహాలు సూచనలు కూడా పరిశీలించి గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ- ఉమ్మడి విజయనగరం జిల్లా కో-ఆర్డినేటర్ కోట్ల కృష్ణ, పార్వతీపురం సమన్వయకర్త ఆదాడ మోహన్ m, కురుపాం నియోజక వర్గ సమన్వయకర్త కండ్రిక మల్లేష్, పార్వతిపురం నియోజక వర్గ సీనియర్ జనసేన నాయకులు చందక అనిల్, రెడ్డి కరుణ, నేయ్యిగాపుల సురేష్, సిరిపురపు గౌరీ, రేవళ్ళ దుర్గ ప్రసాద్, కొమరాడ మండల అధ్యక్షులు తెంటూ శ్రీకర్, కురుపాం నియోజక వర్గ సీనియర్ నాయకులు తాడేల శ్రీరాములు నాయుడు, రుత్తుల సత్యనారాయణ తదిరులు పాల్గొన్నారు.