ఏలూరు, మార్చి26 (జనస్వరం) : రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పడిన కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ కూటమి అభ్యర్థిని గెలిపించాలని తెదేపా నాయకులకు, జనసేన శ్రేణులకు రెడ్డి అప్పల నాయుడు, ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పిలుపునిచ్చారు. ఏలూరు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కూటమితో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని ఇరు పార్టీల నాయకులకు తెలిపారు.. తెదేపా జనసేన కార్యకర్తల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైకాపా సామాజిక మాధ్యమాలు వేదికగా చేస్తున్న కోవర్టు రాజకీయాలను వివరించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి కారణంగా రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించేందుకు తెదేపా భాజపా జనసేన కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు. వైకాపా ప్రభుత్వ అంతమే మన లక్ష్యం కావాలని అన్నారు. పోటీలో తాను ఉన్నట్లుగానే భావించి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి గెలుపునకు జన సైనికులు పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. తెదేపా జనసేన పార్టీ మధ్య విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఎవరు వాటిని నమ్మవద్దు అన్నారు. తాను ఎల్లప్పుడూ జనసేన తెదేపా శ్రేణుల సహకారానికి కృతజ్ఞతతో ఉంటానని తెలియజేశారు. కూటమి అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ రెడ్డి అప్పల నాయుడు త్వరలో తెలుగుదేశం నాయకుడు లోకేష్ బాబుతో మాట్లాడుతారని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఏలూరు నుంచి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీలా ఉమ్మడి లక్ష్యం వైఎస్ఆర్సిపి పార్టీని గద్దె దించడమేనని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇద్దరం కలిసి తిరిగి పార్టీని బలోపేతం చేస్తామని, అభ్యర్థి గెలుపు కోసం విశేషంగా కృషి చేస్తామని తెలిపారు. గెలిచిన తరువాత జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తలకు తగిన న్యాయం చేస్తామని తెలిపారు.. నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీల కూటమి అభ్యర్థి గెలుపు కోసం వీధి వీధి ఇంటికి తిరిగి ప్రతి ఓటరును కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బిజెపి యొక్క ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా ఎన్నికల కన్వీనర్ రాఘవయ్య చౌదరి, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి ప్రసాద్,జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, టిడిపి నగర అధ్యక్షులు పెద్ది బోయిన ప్రసాద్, టిడిపి సీనియర్ నాయకులు చోడే వెంకటరత్నం, టౌన్ సెక్రటరీ రెడ్డి నాగరాజు, జనసేన నాయకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.