అవనిగడ్డ, మార్చి22 (జనస్వరం) : కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ తరఫున ఒక ముఖ్యమైన విషయాన్ని మిత్రపక్షాలను మర్యాదపూర్వకంగా కోరడం జరుగుతుంది. ఎందుకంటే 2024 ఎన్నికల సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని అదేవిధంగా మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంను పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. దాదాపుగా అవనిగడ్డ నియోజకవర్గంలో 2014 నుండి ఇప్పటివరకు జనసేన పార్టీ ప్రధాన సమస్యల పైన పోరాటం చేసి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది.2019 సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థికి 28 వేల పైన ఓట్లు వచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఆలోచన చేసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించటం కోసం పొత్తులో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. మా మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ పెద్దలకు, భారతీయ జనతా పార్టీ పెద్దలకు ఒక్కటే విన్నపం. అందరం కలిసి సోదర భావంతో ముందుకు వెళ్లి మన అవినిగడ్డ నియోజకవర్గంలో అధినాయకులు ఏ వర్గానికి చెందిన వ్యక్తినైనా అభ్యర్థిగా ప్రకటిస్తే పొత్తుల ధర్మంగా మనందరం కలిసి ఆ అభ్యర్థిని గెలిపించుకుందాం. ఎందుకంటే గత పది రోజులుగా నియోజకవర్గంలో అనేక రకాలైన పుకార్లు షికారు చేస్తున్నాయి.ముఖ్యంగా అవనిగడ్డ నియోజకవర్గం జనసేనకు కేటాయిస్తే ఓడిపోతుంది అనీ ప్రచారం చేయటం చాలా బాధాకరం. మేము ఇప్పటివరకు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పైన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పైన ఉన్న గౌరవంతో ఇప్పటివరకు మేము ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ఉండలేదు.ముందుగా ఈ మీడియా సమావేశం ద్వారా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వానికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే పొత్తులో భాగంగా అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించినందుకు. ఈ మీడియా సమావేశం ద్వారా తెలుగుదేశం పెద్దలకు గాని, భారతీయ జనతా పార్టీ పెద్దలకు గాని వినయపూర్వకమైన అభ్యర్థన ఒక్కటే, జనసేనకు కేటాయించిన సీటును జనసేన పార్టీకి వదిలిపెట్టి మిగిలిన రెండు పార్టీలు పెద్దలు ముందుండి జనసేన పార్టీ అభ్యర్థి విజయం కోసం కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే అవినిగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలి అంటే మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇప్పటికే అవనిగడ్డ నియోజకవర్గం అభివృద్ధిలో వెనకబడిన విషయం మన అందరికీ తెలిసిందే. ఏళ్ల తరబడి ప్రధాన సమస్యలన్నీ పెండింగ్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఉదాహరణకి ఎదురు మొండి బ్రిడ్జి విషయంలో గానీ, సుయోజ్ గేట్లు బాగు చేయించే విషయంలో కానీ,రక్షణ కర గట్లు బాగు చేయించుకునే విషయంలో కానీ, సాగునీరు, త్రాగునీరు, విద్యా, వైద్యం మొదలైన ప్రధాన విషయాల్లో మన పొత్తు పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాటం చేసి వైసిపి ప్రభుత్వాన్ని ఓడించి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉన్నది.కాబట్టి మనలో మనకి చిన్న చిన్న సమస్యలు ఉన్న సర్దుబాటు చేసుకుని పెద్ద మనసుతో జనసేన పార్టీకి అండగా నిలబడి పొత్తు ధర్మంలో భాగంగా అధినాయకులు సూచించిన అభ్యర్థిని గెలిపించుకుందాం. దయచేసి పొత్తులో భాగంగా మనందరం చేయి చేయి కలుపుదాం వైసిపిని ఓడిద్దాం. ఈరోజు ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి లంకే యుగంధర్, జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ షరీఫ్, పిట్టలలంక సర్పంచ్ వెంకటేశ్వరరావు, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు చెన్నగిరి సత్యనారాయణ,అవనిగడ్డ, మోపిదేవి,చల్లపల్లి,కోడూరు మండలాధ్యక్షులు గుడివాక శేషుబాబు,మర్రే గంగయ్య, పుషడుపు రత్న గోపాల్, s.విమల కృష్ణ మరియు ఎంపీటీసీలు బొప్పన భాను, కటికల వసంత కుమార్ మరియు వార్డు నెంబరు సాయి భార్గవ్,అవినిగడ్డ మండల కార్యవర్గ ఉపాధ్యక్షులు తుంగల నరేష్, అవనిగడ్డ టౌన్ కమిటీ ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, టౌన్ కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.