శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి గౌరవ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు హఫీజ్ పేట్ డివిజన్ అద్యక్షులు మద్దూరి నాగలక్ష్మి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కందగట్ల శ్రీధర్ నాయకత్వంలో స్థానిక హఫీజ్పేట్ డివిజన్ లోని ప్రేమ్ నగర్ కాలనీలో బడుగు బలహీనర్గాలకు శ్రామిక కార్మిక కర్షక పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ మాధవ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని అన్ని దానాలలో కల్లా అన్నదానం గొప్పదని అటువంటి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన హాఫిజ్ పేట్ డివిజన్ అధ్యక్షురాలు నాగలక్ష్మి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ కోఆర్డినేటర్లు వీర మహిళలు, జన సైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.