గాజువాక ( జనస్వరం ) : జనసేన పార్టీ పిఏసి సభ్యులు, గాజువాక ఇంఛార్జ్ కోన తాతారావు అధ్యక్షతన జనసేన కార్యాలయంలో మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాజువాక లో వీర మహిళలకు సంత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. తాతారావు మాట్లాడుతూ మహిళల పట్ల అపారమైన గౌరవం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని, అందుకే జనసేన మహిళా విభాగానికి ఝాన్సీ లక్ష్మీ భాయి వీర మహిళా విభాగం అని పేరు పెట్టారని తెలియజేశారు. సమాజంలో ముఖ్యమైన పాత్ర మహిళలదే కనుక వీరికి విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయంగా జనసేన పార్టీ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. చట్ట సబల్లో, స్థానిక సంస్థల్లో మహిళలకు ఉన్న రిసర్వేషన్ కు మించి అధిక ప్రాధాన్యత ఇస్తామని, మహిళా రక్షణ చట్టం ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్య, ఉద్యోగాల్లో రాణించేలా చేయడంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వృత్తి నైపుణ్యాలు పెంపొందించేలా సర్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేస్తామని తెలిపారు. మహిళల సంక్షేమం, రక్షణ ఆర్థికాభివృద్ధి జనసేన పార్టీ ప్రధాన లక్ష్యం అని తాతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు లంకల మురళీ దేవి, మాక షాలిని, గొన్న రమాదేవి, లంక లతా, దాసరి జ్యోతి రెడ్డి, లక్ష్మి, పత్తి రామలక్ష్మి, మహా లక్ష్మి, లంక మల్లిక, ఇందిరా ప్రియదర్శిని, కాద అరుణ కుమారి, జయ లక్ష్మి, ఆది లక్ష్మి పాల్గొన్నారు.