సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఓటమి భయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బీటలు వాలినట్టుగా ఏదైతే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరి పార్టీ కార్యాలయం నందు విధులు నిర్వహించే సిబ్బంది, వారు నివాసముండే ప్రాంతాలు అన్నిటిని కూడా అకస్మాత్తు తనిఖీలు చేపట్టడం, తుపాకీలతో బెదిరించడాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున తాము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎటువంటి పర్మిషన్ లేకుండా అర్ధరాత్రులు నివాసాలకు వెళ్లి తనిఖీలు చేయడం పై మీ ఉద్దేశం ఏమిటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమి భయంతో జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన వారిపై కావచ్చు అదేవిధంగా సిబ్బందిపై కావచ్చు ఎటువంటి తనిఖీలు చేపట్టడం మీకు అంత మంచిది కాదు ఏదైనా ఉంటే రాజకీయంగానే తెలుసుకోవాలి కానీ పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయడం పర్దాలను కట్టుకొని ప్రజల్లోకి రావడం రాజకీయ వ్యవస్థకే సిగ్గుచేటు అన్నారు. అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో ప్రజల యొక్క హక్కులు విధులు విధానాలని రాజ్యాంగబద్ధంగా పాటించాలి గాని లా అండ్ ఆర్డర్ ని మీరు చెప్పు చేతల్లోకి తీసుకొని పోలీసు వ్యవస్థని ఇలాంటి దుర్మార్గపు చర్యలను చేపట్టే విధంగా వినియోగించడం మీకు సమంజసం కాదు ఇంకో 45 రోజుల్లో వైసిపి ముగింపు 45 రోజులు తర్వాత జనసేన తెలుగుదేశం ప్రజా ప్రభుత్వం ఉదయం తో ఈ రాష్ట్ర అభివృద్ధి సుభిక్షంగా ఉండబోతుంది ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మనస్పూర్తిగా గౌరవంగా తెలియజేస్తున్నాను.ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని పినిశెట్టి మల్లికార్జున్ సందూరి శ్రీహరి, రహీం, అక్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.