అనంతపురము ( అనంతపురం ) : మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కవిత్రయ మహాభారతం – వర్తమాన సమాజం: సమాలోచన ” అనే అంతర్జాతీయ సదస్సులో ఉత్తమ వ్యాస ప్రచురణ, పత్ర సమర్పణకు గాను ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ విద్యార్థిని సాకే హరిభక్త భానుశ్రీ నగదు బహుమతిని అందుకున్నారు. అంతర్జాతీయ సదస్సులో వ్యాసం రాసి, పత్ర సమర్పణ చేసిన నలుగురు విద్యార్థులకు నగదు బహుమతులను డా. వడ్లమాని కనకదుర్గ అమ్మమ్మ తాతయ్య కీ.శే. వడ్లమాని సుభద్రమ్మ, సోమశేఖరం పేరుతోనూ, తల్లిదండ్రులు కీ.శే. వడ్లమాని హనుమాయమ్మ, రామం పేర్లతో బహుమతులను ప్రకటించారు. సదస్సులో పాల్గొని ఉత్తమ పత్రసమర్పణ చేసిన విద్యార్థులకు ఈ బహుమతులను సమాపనోత్సవ సభలో అందించారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తరుపున 6 మంది పత్ర సమర్పణలు చేయగా, వారిలో సాకే హరిభక్త భానుశ్రీ నగదు పురస్కారానికి సదస్సు సంచాలకులు ఆచార్య విస్తాలి శంకర్ రావు ఎంపిక చేశారు. ఆమె నగదు పురస్కారానికి ఎంపికవడం పట్ల ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య సి. షీలా రెడ్డి, తెలుగు శాఖ అధ్యక్షులు డా. గరికిపాటి గురజాడ విద్యార్థినిని ప్రత్యేకంగా అభినందించారు. డాక్టర్ బత్తల అశోక్ కుమార్ హర్షం వ్యక్తంచేశారు.