గుంతకల్ ( జనస్వరం ) : గుత్తి పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని అనంతపూర్ రోడ్డులో గల మధ్యలో ఆగిపోయిన సమగ్ర తాగునీటి సరఫరా ప్రాజెక్టుని గుంతకల్ నియోజవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ మరియు గుత్తి జనసేన బృందం పరిశీలించి అనంతరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన సమన్వయకర్త వాసగిరి మణికంఠ మరియు గుత్తి మండల జనసేన నాయకులు చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, నాగయ్య, బోయగడ్డ బ్రహ్మయ్య మాట్లాడుతూ గుంతకల్ శాసనసభ్యులు వెంకట్రామిరెడ్డి గుత్తి ప్రజల దాహార్తిని తీర్చు అంటే, ప్రతిపక్ష పార్టీల నాయకుల గురించి దుమ్మెత్తి పోయడం శోచనీయమని అన్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గము లోని గుత్తి మున్సిపాలిటీ, పామిడి పట్టణములలో నెలకొన్న తీవ్రమైన తాగునీటి ఎద్దడిని నివారించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో సమగ్ర తాగునీటి సరఫరా పథకం( CWSP) ద్వారా గుత్తి పట్టణానికి 173.02 కోట్లు, పామిడి పట్టణానికి 69.30 కోట్ల మంజూరు చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా పనులు ప్రారంభించడం జరిగింది. కానీ పనులు ప్రారంభమైన కొన్ని నెలలకే ఎన్నికల రావడం తో వైకాపా ప్రభుత్వం ఏర్పడింది. వైకాపా పూర్తి నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడంతో నేటికీ పనులన్నీ ఆగిపోయి ఉన్నాయి. నిర్మాణ కేంద్రాల వద్ద సామాన్లు అన్ని తుప్పు పట్టి చెడిపోతున్నాయి .దీంతో గుత్తి మున్సిపాలిటీ, పామిడి పట్టణ ప్రజలు తీవ్ర త్రాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా గుత్తి పట్టణంలో అనేక సమస్యలు గుత్తి చెరువు నీరు తెప్పించడంలో, శాశ్వత గుత్తి మున్సిపల్ కార్యాలయం ఏర్పాటు చేయడంలో, ఫోర్ వే రోడ్డు పని చేయించడంలో ఎమ్మెల్యే ఘోరంగా విఫలమయ్యారు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ, మండల అధ్యక్షులు పాటిల్ సురేష్, చిన్న వెంకటేశులు, బోయగడ్డ బ్రహ్మయ్య, వెంకటపతి నాయుడు, నాగయ్య రాయల్, కార్తీక్, హసన్, హసేన్, కృష్ణ నాయుడు నాగయ్య, రవితేజ, వెంకటేష్, ధనంజయ మరియు జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, కత్తుల వీధి అంజి, అమర్, అనిల్ కుమార్, లారెన్స్, పాండు, శివ తదితరులు పాల్గొన్నారు.