– అనారోగ్యంతో బాధపడుతున్న జనసైనికుడు యుగంధర్ అన్న కొడుకుకి పరామర్శ
– తన వంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందించి, భవిష్యత్తులో జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా.
గుంతకల్ ( జనస్వరం ) : జనసైనికుడు యుగంధర్ కొడుకు గత కొద్ది సంవత్సరాలుగా మానసికంగానూ, శారీరకంగానూ ఎదుగుదల లేకపోవడంతో అనేకమంది డాక్టర్లను సంప్రదించిన ఎటువంటి ప్రయోజనం లేదు. మెరుగైన చికిత్స కోసం మరియు అబ్బాయి సంరక్షణ, సహాయార్థం ఒకసారి అబ్బాయిని పరామర్శించాలని జనసైనికుడు యుగేందర్ జనసేన పార్టీ గుంతకల్ నియోజకవర్గం సమన్వయకర్త వాసగిరి మణికంఠను కోరారు. ఆయన ఈరోజు వారి ఇంటికి వెళ్లి ఆ అబ్బాయి స్థితిగతుల గురించి ఆరా తీసి పరామర్శించి, తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయం చేసి భవిష్యత్తులో మెరుగైన చికిత్స ఇప్పించడానికి తన వంతు సహకారం అందిస్తానని వారి కుటుంబానికి భవిష్యత్తులో జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు… అనంతరం వాసగిరి మణికంఠ గారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబం అయినా యుగంధర్ అన్న కొడుకుని దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి సంరక్షించాలి అని మనవి చేశారు. అలాగే జనసైనికులు, జనసేన నాయకులు కూడా మన కుటుంబ సభ్యుల్లో ఒకరైన యుగంధర్ కుటుంబానికి తోచిన సహాయం అందించి మానవత్వాన్ని చాటుకోవాలని కోరారు… ఈ కార్యక్రమంలో జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు పవర్ శేఖర్ సీనియర్ నాయకులు ఆటో రామకృష్ణ, కసాపురం నంద, సుబ్బయ్య, కత్తుల వీధి అంజి జనసైనికులు అనిల్ కుమార్, మంజునాథ్, రానా, పరుశు, సూరి తదితరులు పాల్గొన్నారు.