నెల్లిమర్ల ( జనస్వరం ) : పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జ్ లోకం మాధవి గారు డెంకాడ మండలం మోపాడు గ్రామంలో ఇంటింటికి తిరిగారు. జనసేన మేనిఫెస్టో మరియు సిద్ధాంతాలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వ స్థాపనకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. గాజు గ్లాసు పై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లోకం మాధవి గారి కోరడం జరిగింది. లోకం మాధవి గారు మాట్లాడుతూ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని ప్రస్తుత ప్రభుత్వం కానీ పాలకులు గానీ ప్రజలను పట్టించుకోవడంలేదని గ్రామాలలో నిరుద్యోగ సమస్య అదే విధంగా ఉందని అన్నారు. డ్రైనేజీ త్రాగునీరు పరిస్థితులు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయని వాపోయారు.