విజయనగరం ( జనస్వరం ) : స్థానిక 42వ డివిజన్, కామాక్షినగర్ లో శ్రీ చైతన్య స్కూల్ ముందు స్పీడ్ బ్రేకర్లు వేసి, ప్రమాదాలను అరికట్టాలని విజయనగరం పట్టణ అభివృద్ధి వేదిక కన్వీనర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) కోరారు. ఈసందర్భంగా బుధవారం ఉదయం జాతీయ రహదారుల డివిజనల్ కార్యాలయంలో సీనియర్ సూపెరెండెంట్ రమణకు వినతిపత్రాన్ని పార్టీ నాయకులు ముదిలి శ్రీనివాసరావు తో కలసి అందజేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ స్కూల్ పెట్టే సమయంలోనూ, విడిచిపెట్టే సమయంలోనూ విద్యార్థులు ఒకేసారి బయటకు రావటంతో విపరీతంగా వాహనాలు రద్దీతో నిలిచిపోవడంతో స్పీడ్ బ్రేకర్స్ లేక వాహనాలు వేగరంగా వెళ్ళటంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని దీనితో విద్యార్థినీ విద్యార్థులు, ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని అన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని, స్పీడ్ బ్రేకర్స్ వేసి ప్రమాదాలను నివారించాలని కోరారు. సంబంధిత అధికారి సానుకూలంగా స్పందిస్తూ డి.ఈ. దృష్టిలో పెట్టి చేద్దామని తెలిపారు.