జగ్గంపేట ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా రెండు నెలల్లో రానున్న సార్వత్రిక ఎన్నికలలో పట్టుదలతో పని చేయడానికి జగ్గంపేట జనసేన కేడర్ అంతా సమాయత్తంగా ఉన్నామని జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తెలియజేశారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకు సంబంధించి మొత్తం 248 మంది బూత్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం కొరకు మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలి వెళ్ళడం జరిగింది అని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన – టీడీపీ కూటమి తప్పకుండా గెలిచి ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించడం తధ్యం అని అన్నారు. ఈ బూత్ ఏజెంట్లకు శిక్షణ ఇవ్వడంలో చొరవ తీసుకుని ముందుగా జగ్గంపేట నియోజకవర్గ బూత్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.