ఏలూరు ( జనస్వరం ) : నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను ఉధ్ధరిస్తున్నామని చెప్పి కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పి చేయి దులుపుకుంటున్న ప్రభుత్వం.. ఆ కాంట్రాక్టర్లు కూలీలను పెట్టి పని చేయించకుండా ఆ పాఠశాలలోని విద్యార్థులతో రాళ్ళు మోయిస్తున్నారనీ తెలిసి మీడియా సమావేశంలో అధికారులను, కాంట్రాక్టర్లను, స్కూల్ యాజమాన్యాన్ని హెచ్చరించిన రెడ్డి అప్పల నాయుడు…ఈ సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనే కార్యక్రమం పెట్టి ఉద్దరిస్తున్నానని చెప్పి కొన్ని స్కూళ్ళను మాత్రమే పరిమితం చేశారు.. ఆ స్కూల్లో కూడా ఏదైతే కాంట్రాక్టర్లు కు ఇచ్చిన వర్క్స్ ఏమైతే ఉన్నాయో వారు చేయవలసిన పనులను విద్యార్థులతోనూ పిల్లలతోనూ పనిచేయిస్తున్నారు.. ఏలూరు నియోజకవర్గంలో రామా నగర్ కాలనీలో ఉన్నటువంటి హైస్కూల్లో పిల్లలతో సిమెంట్ బ్రిక్స్ మోయిస్తున్నటువంటి పరిస్థితి.. అక్కడ ఉన్నటువంటి హెడ్మాస్టర్ కానీ ఉపాధ్యాయులు అందరూ కూడా కుమ్మక్కయి అక్కడ విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు.. ఈరోజు న విద్యార్థులను తల్లిదండ్రులు చదువుకోవడానికి పంపిస్తే కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇచ్చి వారి చేత పనులు చేయించుకోవాల్సింది పోయి, విద్యార్థులతో ఆ సిమెంట్ బ్రిక్స్ మోయించడం ఏమిటని ప్రశ్నించారు.. గత పది రోజులుగా ఈ పని చేయిస్తూనే ఉన్నారని మండిపడ్డారు.. ఇది చాలా దుర్మార్గమైన పని.. దీనిపైన విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్య తీసుకోవాలని ఆ స్కూల్ యొక్క హెచ్.ఎం. గాని ఉపాధ్యాయులు గాని ఎవరైతే అక్కడ పిల్లలతో పని చేయిస్తున్నారో వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం అని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు.. మీడియా సమావేశంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, అధికార ప్రతినిధి అల్లు చరణ్, మీడియా ఇంచార్జీ జనసేన రవి, కోశాధికారి పైడి లక్ష్మణరావు,నాయకులు నూకల సాయి ప్రసాద్, రెడ్డి గౌరీ శంకర్, వీరంకి పండు తదితరులు పాల్గొన్నారు..