నెల్లూరు రూరల్ ( జనస్వరం ) : యువ జన సైనికుడు ప్రసన్న ఆధ్వర్యంలో దాదాపుగా 20 మంది యువత జనసేనలో చేరారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ వారి కార్యాలయంలో జనసేన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచేందుకు సిద్ధంగా ఉంది. జిల్లాలో వైఎస్ఆర్సిపి నాయకులంతా పారిపోతున్నారు. జిల్లాలో పదికి పది సాధించిన వైఎస్ఆర్సిపి అడ్రస్ లేకుండా పోతుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా కార్యకర్తలుగా మారి జనసేనను పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకునేందుకు ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో సిద్ధపడ్డారని తెలిపారు. ప్రత్యక్షంగా జరుగుతున్న దోపిడీ చూస్తూ.. చదువుకున్న యువతకి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు యువత అంతా కూడా సిద్ధంగా ఉంది. రేపటి తరం జనసేనదే వారి భవిష్యత్తు కాపాడగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే అని తెలుసుకున్నారు.. మిత్రపక్షమైన తెలుగుదేశంతో కలిసి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్న, సిద్దు, రాజేష్, దిలీప్, లోకేష్, దినేష్, అనుదీప్, ప్రేమ్, కిషోర్ తదితరులు చేరారు…