
నెల్లిమర్ల ( జనస్వరం ) : నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ లోకం మాధవి జన్మదిన వేడుకలు భోగాపురంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం అత్యంత వైభవంగా జరిగాయి.. ఉమ్మడి విజయనగరం జిల్లాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లిమర్ల నియోజకవర్గం నాలుగు మండలాల నుండి సుమారు 200 కుటుంబాలను లోకం మాధవి కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసిపి పార్టీని ఇంటికి పంపించడం తద్యమని, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని గెలిపించి నెల్లిమర్లలో నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను ఎగరవేయడం తథ్యమని అన్నారు.. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఆమె జన్మదిన సందర్భంగా హామీ ఇచ్చారు..