అనంతపురం ( జనస్వరం ) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే శ్వాసగా పనిచేసి జనసేన జెండా ఎగుర వేద్దామని అనంతపురము అర్బన్ ఇంచార్జ్ మరియు జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ పిలుపునిచ్చారు. రాంనగర్ కార్యాలయంలో భాగ్యనగర్, బిందుల కాలనీ, కల్పనా జోష్ కాలనీ నాయకులతో సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. చిత్తశుద్ధి అకుంఠిత దీక్ష నిబద్ధత కలిగిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన గెలిస్తే ప్రజలకు జరిగే మేలును వివరించాలన్నారు. మీకు అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటానని.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని టి.సి.వరుణ్ ఉద్బోధించారు. కార్యక్రమంలో నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, నాయకులు లక్ష్మీపతి, రహీం భాష, నౌషాద్ తదితరులు పాల్గొన్నారు.