ఉరవకొండ ( జనస్వరం ) : పట్టణంలోని పంచాయతీ క్వార్టర్స్ లో 02 డిసెంబర్ 2004 సంవత్సరంలో మార్కెట్ సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. కానీ అధికారులు పట్టణానికి దూరంగా స్థలం కేటాయించారు.పట్టణానికి దూరంగా ఉండటంతో అక్కడికి వెళ్లడానికి కూరగాయల వ్యాపారులు ఆసక్తి చూపలేదు.దీంతో పట్టణంలోనే ప్రధాన కూడలిలో వ్యాపారస్తులు రోజువారి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. దీని మూలంగా పట్టణంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. రెండు దశాబ్దాల కాలం కావస్తున్నా కూడా పట్టణంలో కూరగాయల మార్కెట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారని. సుంకం చెల్లింపు ద్వారా ప్రతి సంవత్సరం 12 లక్షల పైచిలుకు ఆదాయం గ్రామపంచాయతీకి చేకూరుతున్నా కూడా అధికారులు మార్కెట్ ఏర్పాటుకు ముందుకు కదలక పోవడం ఏంటని కనీసం ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం మేల్కొని కూరగాయల మార్కెట్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఉరవకొండ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దేవేంద్ర, రాజేష్, మణి కుమార్, చిరంజీవి, ధనుంజయ, బోగేష్, చందు తదితరులు పాల్గొన్నారు.