విశాఖపట్నం ( జనస్వరం ) : చలువతోటలో కళ్యాణ మండపం కావాలని స్థానిక ప్రజలు ఎప్పటినుంచో తనకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారని కౌన్సిల్లో కూడా ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి తాను ఎంతో పోరాటం చేశానని చివరకు అది సాధించడం జరిగిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు తెలిపారు. జీవీఎంసీ 32వ వార్డు చలువతోటలో కళ్యాణ కళ్యాణ మండపం నిర్మాణానికి శుక్రవారం ఉదయం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, మరియు స్థానిక 32 వార్డ్ కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు మాట్లాడుతూ చలువ తోట ప్రాంత ప్రజలకి ఈ కళ్యాణ మండపం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. స్థానిక ప్రజల కల సాకారం చేసేందుకు తాను ఎంతగానో శ్రమించినట్లు పేర్కొన్నారు. తాను పోరాడి సాధించినట్లు వెల్లడించారు. ఇక్కడ కళ్యాణ మండపం పూర్తయితే స్థానిక ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇది నిర్మాణ పనులు పూర్తిచేసుకుని త్వరలో ప్రజలకు అందుబాటులో రానున్నట్లు తెలిపారు. సుమారు రూ.80 లక్షల 78 వేల రూపాయల అంచనా వ్యయంతో ఈ కళ్యాణ మండపం నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ సిహెచ్ పార్వతి, కాంట్రాక్టర్ రత్నగిరి ఎంటర్ప్రైజెస్ వీరభద్రరావు, సిపిఐ నాయకులు బుజ్జి, ఇ.అప్పారావు , లక్ష్మి, ,కుమారి , కందుల కేదార్నాథ్ , కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.