రాజంపేట ( జనస్వరం ) : ఒంటిమిట్ట మండలం కోనరాజుపల్లిలోని గ్రామ పెద్దలు చిన్నసుబ్బయ్య, కదిరయ్య, గురువయ్య, మహిళలు నాగలక్ష్మి, కదిరమ్మ, సుప్రజ, యువత వెంకటసుబ్బయ్య, సతీష్, గిరి, గంగాధర్, మరియు 75 కుటుంబాలు దాదాపు 250 మంది గ్రామస్తులు మరియు మహిళలు రాజంపేట జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఆయన జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మొదట గ్రామస్తులు అందరూ అతికారి దినేష్ గారికి బ్యాండ్ బాజాలతో సాదర స్వాగతం పలికి శాలువ గజమాలతో సత్కరించారు. అనంతరం గ్రామ ప్రజలందరికీ భోజనం సదుపాయం కల్పించారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ ఈరోజు కోనరాజు పల్లె గ్రామస్తులంతా జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఇది వైసీపీ పార్టీ పతనానికి నాంది అని బడుగు బలహీన వర్గాలకు ఈ వైసీపీ చేసింది ఏమీ లేదు అని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించి వారికి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు అంటూ బస్సు యాత్రలు చేసిన ఈ వైసీపీ పెద్దలు దళితుల పైన పదివేల దాడులు చేసి అక్రమ కేసులు బనాయించి అనేకమంది దళిత సోదరులను హత్యలు చేయించి డోర్ డెలివరీ చేశారని అన్నారు. ఇలాంటి అరాచక పాలన చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్ద దించే రోజుల దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఈరోజు పార్టీలో చేరిన ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుడిలా పని చేసి జనసేన టిడిపి పార్టీలను బలపరిచి ప్రభుత్వ స్థాపనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల వీర మహిళ శ్రీమతి వరలక్ష్మి, జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, పోలిశెట్టి శ్రీనివాసులు, గుగ్గిళ్ళ నాగార్జున, ఉపేంద్ర, మస్తాన్ రాయల్, నేతి వెంకటేష్, రత్నం, గుగ్గిల వెంకటేష్, సుబ్బయ్య, రమణ, సతీష్, వినయ్, తదితరులు పాల్గొన్నారు.