అనంతపురం ( జనస్వరం ) : రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ గ్రామ సర్పంచుల 16డిమాండ్ల అమలు సాధన కోసం మహాత్మ గాంధీ వర్ధంతి రోజున రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. అనంతపురం కలెక్టర్ కార్యాలయం ఎదురుగా పంచాయతీరాజ్ ఛాంబర్ జిల్లా అధ్యక్షుడు వేలూరు రంగయ్య రాష్ట్ర కార్యదర్శి డేగల కృష్ణమూర్తి, ఇస్మాయిల్ సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు గొనుగుంట్ల భూషణ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు జనసేన పార్టీ తరపున హాజరైనారు. వారి దీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం సచివాలయ వ్యవస్తను తెచ్చి వాలంటీర్ ల ద్వారా సర్పంచు విధులను లాక్కొని గ్రామ అభివృద్ధికి సర్పంచులకు నిధులు ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వం సర్పంచులను విధులకు, నిధులకు దూరంచేసి వారిని ఉత్సవ విగ్రహాలుగా తయారు చేసిందని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని జగన్ రెడ్డి తుంగలో తోక్కాడని 14,15వ ఆర్థిక సంఘం నిధులను బటన్ నొక్కడానికి దారి మళ్లించి పంచాయితీలలో మౌలిక సదుపాయాలు లేకుండా చేశాడని ప్రభుత్వం వెంటనే వారి ప్రధాన 16డిమాడ్లయిన కేంద్ర ప్రభుత్వం పంపిన 14వ ఆర్థిక సంఘం నిధులు 8,629.79 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు జమచేయాలని అన్నారు. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,010 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24కు రావాల్సిన 2,031 కోట్ల రూపాయల కేంద్ర ఆర్థిక సంఘం నిధులు మొత్తం 4,041 కోట్ల రూపాయల నిధులను వైకాపా ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేయాలని అన్నారు. వీటితోపాటు మూడు వేల రూపాయలు ఉన్న సర్పంచుల గౌరవ వేతనాన్ని 15 వేల రూపాయలకు పెంచాలి అదేవిధంగా వీరి ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గాంధీ మహాత్ముడు కలలు కన్న గ్రామ స్వరాజ్యం జనసేన టిడిపి పార్టీల ఉమ్మడి ప్రభుత్వ స్తాపనతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.