సర్వేపల్లి ( జనస్వరం ) : సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు చేపట్టిన జనసేన విజయ పాదయాత్ర ఎనిమిదవ రోజైన సోమవారం మనుబోలు మండలంలో కొనసాగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం కలిసి ప్రజా ప్రభుత్వ స్థాపనలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలనే ఆశయంతో ఈ విజయ పాద యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో 8వ రోజు గోవిందరాజుపురం నుంచి మొదలై బండేపల్లి మడమనూరు వీరంపల్లి గొట్లపాలెం మీదుగా పొదలకూరు సరిహద్దు వరకు 20 కిలోమీటర్లు విజయాత్ర కొనసాగింది. ఈ విజయ పాదయాత్రలో గ్రామాలలో అనేక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకోవడం గ్రామాలలో ఉన్న ప్రతి సమస్యను కూడా రేపు ప్రజా ప్రభుత్వంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జగనన్న ఇళ్లలో కోట్ల రూపాయల అవినీతి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి జగనన్న గ్రామాలనే నిర్మించామని చెప్పాడు కానీ ఇక్కడ కనీసం జగనన్న ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ తోలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు పైన చూస్తే హై లెవెల్ హాయ్ వోల్టేజ్ కరెంటు తీగలు వెళ్తున్నాయి. వాటి కింద ప్లాట్లు ఇస్తే వాళ్ళ పరిస్థితి ఏంది నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అవుతుంటే ఇప్పటివరకు కూడా పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడం గానీ పేదవాడికి ఇళ్ల స్థలం ఇవ్వాలని ఆలోచన లేకుండా మసిబూసి మారేడు కాయ చేసే విధంగా మాటల గారడితో కాలయాప చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి స్వస్తి పలికి రేపు జనసేన టిడిపిని ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే ప్రజా సమస్యల పరిష్కారంలో నిమగ్నమై గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాంమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం గుమినేని వాణి భవాని, వెంకటాచలం మండలం కార్యదర్శి శ్రీహరి, మనుబోలు మండల నాయకులు సుబ్రహ్మణ్యం, సుధాకర్, శీను, రమేష్, నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.