బొబ్బిలి ( జనస్వరం ) : విద్యా శాఖ మంత్రి బొత్స ఇలాకాలో గ్రంథాలయం లేకపోవడం సిగ్గు చేటని జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే ప్రతీ విద్యార్థి గ్రంథాలయాన్నే దేవాలయంగా భావిస్తారు. అలాంటి గ్రంథాలయాన్ని బొబ్బిలి మున్సిపాలిటీలో లేకుండా చేసిన ఘనత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడు గారికే దక్కుతుందన్నారు. ఈ సమస్య కేవలం బొబ్బిలిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అరకొరగా ఉన్న గ్రంథాలయాలు అన్నిటిలోనూ ఉంది. ఈ వైసిపి ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థ నిధులను దారి మల్లించుకుని మొత్తం ఈ వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రకు నిరసనగానే ఈరోజు బొబ్బిలిలో చేస్తున్న జనసేన నిరాహార దీక్ష చేపట్టడం జరిగిందన్నారు. బొబ్బిలి శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయం విషయంలో, అక్కడి విద్యార్థుల ఇక్కట్లు చూసి గత 6 నెలలు నుంచి జనసేన పార్టీ తరపున పలుసార్లు ప్రశ్నిస్తే, జనసేన పార్టీ ఒత్తిడి భరించలేక వైసిపి ప్రభుత్వం 3 నెలలు క్రిందట వారం రోజుల్లో మరమ్మత్తులు చేయించి అవసరమైన స్టడీ మెటీరియల్ మరియు కనీస మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని చెప్పి గ్రంథాలయాన్ని ఖాలీ చేయిపించేసి, ఆ భవనం పైకప్పును కూల్చేశారు. ఇప్పటికి 3 నెలలు కావస్తున్నా ఒక్క ఇటుక పని కూడా చేయకుండా ఈరోజు బొబ్బిలిలో ప్రతిష్టాత్మకమైన గ్రంథాలయమే లేకుండా చేసేసారు. ఊరుకో వైన్ షాప్ పెట్టడానికి ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులుంటాయి గాని, విద్యార్థులకు నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడే గ్రంథాలయం మాత్రం నడపలేరా? విద్యా శాఖ మంత్రి సొంత జిల్లాలోనే గ్రంథాలయాల పరిస్థితి ఇలా ఉంటే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెంత దారుణంగా ఉంటుందో ఆలోచించాలి. విద్యార్థులు, నిరుద్యోగుల విషయంలో ఈ వైసిపి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగానే ఈ నిరాహార దీక్ష అని అన్నారు. ఈ పనికిమాలిన దద్దమ్మ వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎలాగూ ఇవ్వలేకపోతున్నారు. కనీసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు, లేక రాబోయే జనసేన తెదేపా ప్రభుత్వంలోనైనా వచ్చే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుదామనే నిరుద్యోగులకు ఉన్న ఆశ, ఆస్తి ఇలాంటి గ్రంథాలయాలను కూడా వారికి దూరం చేస్తున్న వైసిపి తీరుని నిరసిస్తూ చేస్తున్న దీక్ష ఈ జనసేన నిరాహార దీక్ష అన్నారు. స్థానిక MLA, మున్సిపల్ అధికారుల నుంచి గ్రంథాలయం మరమ్మత్తులు, మౌలిక సదుపాయాలు విషయంలో స్పష్టమైన హామీ వచ్చే వరకు మా ఈ జనసేన నిరాహార దీక్ష కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బొబ్బిలి తెలుగు దేశం ఇంచార్జి బేబీ నాయన, జనసేన పిఎసి సభ్యులు పడాల అరుణ, చీపురుపల్లి నియోజకవర్గం సమన్వయకర్త విసినిగిరి శ్రీనివాస్, సాలూరు నియోజకవర్గం సమన్వయకర్త గేదెల రిషి, రాజాం నియోజకవర్గం సమన్వయకర్త ఎన్ని రాజు, బొబ్బిలి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు రాంబర్కి శరత్, రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ స్టేట్ ఉపాధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు, లోక్ సత్తా పార్టీ నాయకులు ఆకుల దామోదర్, బొబ్బిలి నియోజకవర్గం మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, మరడాన రవి, బవిరెడ్డి మహేష్, వీరమహిళలు యామిని, రమ్య, అలివేణి, ఉమ్మడి విజయనగరం జిల్లా వివిధ మండలాల జనసేన అధ్యక్షులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, రిటైర్డ్ ఉపాద్యాయులు పాల్గొన్నారు.