ఏలూరు ( జనస్వరం ) : పరిపాలన చేతకాని జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఏలూరు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు విమర్శించారు. ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా అశోక్ నగర్ లో ఆయన పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. తుగ్లక్ సైకో రెడ్డి పాలనకు రోజు దగ్గర పడ్డాయని అన్నారు.. జగన్ రెడ్డి అవినీతి పాలనకు రాష్ట్ర ప్రజలంతా విసుగు చెంది ఉన్నారని, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా వైసీపీ జగన్ రెడ్డిని ఏలూరులో ఆళ్ల నానిని ఇంటికి పంపెద్దామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్ర ప్రదేశ్ గా మార్చిన ఏకైక సీఎం జగన్ రెడ్డి అని ఎద్దేవ చేశారు.. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే జనసేన పార్టీ అధికారంలోకి రావలసిన అవసరం ఎంతైనా ఉందని, రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ డివిజన్లో అనేక రకాల సమస్యలు వలయంలా చుట్టుముట్టాయని, ఇన్ని సమస్యలు ఉన్నాయని తెలిసిన ప్రజా ప్రతినిధులు శాసనసభ్యులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పంపడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని దుష్ట సైకో పాలన పోవాలని ప్రజా పరిపాలన రావాలనే ప్రజలంతా కోరుతున్నారన్నారు.. పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించి జనసేన తెలుగుదేశం పార్టీల మధ్య ఐకమత్యం కోరుతున్నారన్నారు.. జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రావాలని ప్రజలంతా ముక్తకంఠంతో ఉన్నారని, జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి ప్రభుత్వం వస్తేనే మంచి పరిపాలన జరుగుతుందని ప్రజలంతా కోరుతున్నారు.. ఎక్కడికి వెళ్ళినా వారు పడుతున్న సమస్యలను మాకు వివరిస్తునే ఉన్నారని, సమస్యలను పరిష్కరిస్తానన్న ఆళ్ళనాని రోజుకో అబద్ధం ఆడుతున్నారని, వారు ఇప్పటికైనా మేల్కొని ప్రజా సమస్యలను పరిష్కరించాలని ఏలూరు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.. ఈరోజున ఈ పాదయాత్రను ఇంత ఘనంగా నిర్వహించిన ప్రేమ్ కుమార్ గారికి, మోహన్ రావు గారికి, సుధాకర్ గారికి డివిజన్ కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు.. మేము ప్రశాంతంగా జనసేన పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటే ప్రజల్లో వస్తున్న అనూహ్యమైన స్పందన చూసి ఓర్వలేక వైసీపీ ప్రతినిధులుగా అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులు మా పార్టీ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.. శాసనసభ్యుడికి నిజంగా దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి కానీ పోలీసులను పెట్టి దౌర్జన్యం చేయడం సరైన విధానం కాదని రెడ్డి అప్పల నాయుడు మండిపడ్డారు.. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు..