తిరుపతి ( జనస్వరం ) : కవిత్వం, జానపదం రెండూ జాతి అభ్యున్నతికి జీవనాడులని ఎస్వీ యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీపద్మావతి విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ అన్నారు. శ్రీశ్రీ కళావేదిక తిరుపతి జిల్లాశాఖ ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హల్లో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డా. కత్తిమండ ప్రతాప్ మార్గనిర్దేశనంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, గుత్తా హరి సర్వోత్తమ నాయుడు పర్యవేక్షణలో, శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి ఆరవ జయపాల్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సంక్రాంతి సాహిత్య, సాంస్కృతిక సంబరాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కవిసమ్మేళనం, జానపద గేయాలాపన కార్యక్రమాన్ని వైభవంగా సాగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అనేకమంది కవులు, కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగింపు సభకు శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఉపాధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు గుత్తా హరిసర్వోత్తమ నాయుడు అధ్యక్షత వహించారు. ఎస్వీ యూనవర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కవిత్వానికి సమాజాన్ని ప్రభావితం చేసే శక్తి వుందన్నారు. జానపదం అంతకన్నా ఎక్కువ ప్రభావం చూపి సమసమాజ స్థాపన చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. శ్రీశ్రీ కళావేదిక రాష్ట్ర కార్యదర్శి ఆరవ జయపాల్ మాట్లాడుతూ, కనుమరుగవుతున్న జానపద సంపదను పరిరక్షించేందుకు శ్రీశ్రీ కళావేదిక ద్వారా కృషి చేస్తున్నామన్నారు.
పలువురు కవులు, కళాకారులకు ఘన సన్మానం :
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు రచయితలు, కవులు, కళాకారులను ఈ సందర్భంగా ఎస్వీ యూనవర్సిటీ పాలకమండలి సభ్యురాలు, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య భూమన సుగుణ సత్కరించారు. తిరుపతి జిరసం వ్యవస్థాపక అధ్యక్షులు సాకం నాగరాజు, సుప్రసిద్ధ నవలా రచయిత వి.ఆర్. రాసాని తదితరులు కవి సమ్మేళనం జానపద కళాకారులకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి సంగిశెట్టి శ్రీనివాస్, ప్రముఖ జానపద కళాకారుడు రెడ్డెప్ప, యువశ్రీ మురళి, డా. బత్తల అశోక్ కుమార్, ఆకుల మల్లేశ్వర రావు, సి. నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.