గాజువాకలో జనసేన పార్టీ భారీ బైక్ ర్యాలీ – సభ

     గాజువాక ( జనస్వరం ) : గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులతో జవసేన పార్టీ PAC సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్  కోన తాతారావు గారు సమావేశం నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ ప్రజల సమస్యల పట్ల ప్రజలతో అనేకమై పోరాటం చేసేందుకు సంసిద్ధం అయిందని ఇందులో భాగంగా  ఆదివారం గాజువాకలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నడుపూరు గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై షీలా నగర వరకు ఈ బైక్ ర్యాలీ కొనసాగుతుందని తెలియజేశారు. వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా జనసేన టిడిపి పార్టీలు ఉమ్మడిగా ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలను తెలియజేస్తామన్నారు. జనసేన పార్టీ వార్డు కార్యవర్గ సభ్యులను, బూతు స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేశామని, ప్రజలకు సుపరిపాలన అందించడమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తామని కోన తాతారావు గారు అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, రాష్ట్ర ఫైనాన్షియల్ కమిటీ మెంబర్ తిప్పల రమణారెడ్డి, 64వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి, లంకల మురళి దేవి, కోన చిన అప్పారావు, రౌతు గోవిందరావు, పోల రౌతు వెంకటరమణ, గొలగాని గోపీచంద్ మాకా శాలిని సంద్రాన భాస్కర్, ముమ్మన మురళి, దాసరి జ్యోతి రెడ్డి లంక లత పాల్గొన్నారు.

See also  అచ్యుతాపురం గ్రామ ప్రజలు చేపట్టిన నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేన నాయకులు