గుంటూరు ( జనస్వరం ) : నాటి బ్రిటిష్ పాలకులకు మించి నియంతృత్వ పాలన సాగిస్తున్న వైసీపీ కబంధ హస్తాల్లోంచి నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్పూర్తితో మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధమవ్వాలని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా 18 వ డివిజన్లోని అడపా బజార్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు తమ వాక్ స్వంతత్ర్యాన్ని , భావ స్వేచ్ఛను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటీష్ పాలన కన్నా వైసీపీ పాలన దారుణంగా ఉందని నేతాజీ స్పూర్తితో వైసీపీ పాలనపై పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ అహింసావాదంతో స్వరాజ్యాన్ని సాధించవచ్చు అంటూ మహాత్మాగాంధీ ఒకవైపు పోరాడుతుంటే సాయుధ, ఆయుధ పోరాటంతోనే బ్రిటీష్ పాలకులను దేశం నుంచి తరిమికొట్టాలని పోరాడిన గొప్ప వీరుడు నేతాజీ అంటూ కొనియాడారు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తన పదునైన వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసిన నేతాజీని దేశభక్తులెవ్వరూ మరచిపోరన్నారు. నేతాజీ స్మారకచిహ్నాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని అదేవిధంగా జపాన్ లో ఉన్న ఆయన అస్తికలను కూడా దేశానికి తీసుకురావాల్చిన బాధ్యత ను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని ఆళ్ళ హరి కోరారు. నగర ఉపాధ్యక్షుడు చింతా రాజు రెల్లి యువ నేత సోమి ఉదయ్, ఎర్రబోతు శ్రీనివాసు, స్వరూప, అడపా హేమంత్, బాలకృష్ణ, పులిగడ్డ గోపి, బందెల నవీన్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ షర్ఫుద్దీన్, కొలసాని బాలకృష్ణ, పులిగడ్డ నాగేశ్వరరావు, గుగ్గిళ్ళ సురేష్, శాంతి, గంగాదేవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.