పామిడి ( జనస్వరం ) : పట్టణంలోని 6,7 వ వార్డుల్లో బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల అధ్యక్షులు ధనుంజయ మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పరిచేది జనసేన తెలుగుదేశం పార్టీలేనని, ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అందించే సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికి తిరిగి వివరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వైయు రామాంజనేయులు, జింకల రామకృష్ణ మోదిన్ దూదు యుగంధర్ మూడో వార్డు సూరి శివారెడ్డి, మాధవ మస్తాన్ శివ, జనసేన పార్టీ నాయకులు పామిడి మండల అధ్యక్షులు ఎం ధనుంజయ, శిక్షావలి, భాస్కర్, గౌడ్ అఫ్జల్, అశోక్ మరియు జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు…