విజయవాడ ( జనస్వరం ) : డా. అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అయితే అదే చేత్తో మీరు అధికారంలోకి వచ్చాక తీసేసిన 27 దళిత సంక్షేమ పధకాలు తిరిగి అమలు చేస్తారా? అని అంబేద్కర్ సాహితి వేదిక రాష్ట్ర కార్యదర్శి, జనసేన జిల్లా నాయకుడు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ ఖండించారు. విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరు పీకేసి మీ పేరు పెట్టుకున్నారు కదా క్షమాపణ చెప్పి తిరిగి అంబేద్కర్ గారి పేరు పెడతారా అన్నారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన మీ యం.యల్. సి ని ఇప్పుడైనా సస్పెండ్ చేసి వెంట తిప్పుకోవడం మానేస్తారా? కనీసం మీ జెండా పట్టుకుని తిరిగిన దళితులకైనా యస్సి కార్పొరేషన్ లోన్లు ఇస్తారా? సబ్సిడీ లోన్లు మాట ఎత్తుతారా? బాక్ లాగ్ పోస్ట్లు భర్తీ చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు అధికారంలోకి రావడానికి ఉపయోగపడిన దళితుడైన కోడికత్తి శ్రీను ను ఇప్పుడైనా వదులుతారా? మంచినీరు అడిగిన దళిత యువకుడి నోట్లో మూత్రం పోసిన మీ నాయకులకు శిక్ష విధిస్తారా? మాస్క్ అడిగాడని పిచ్చోడని ముద్రవేశి చనిపోయేలా చేసిన డాక్టర్ సుధాకర్ కుటుంబానికి క్షమాపణ చెప్తారా? యస్సి కాలనీల్లో కుళాయి నీరు డ్రైనేజిల సంగతి కాస్తయినా పట్టించుకుంటారా? మీరు అధికారం లోకి వచ్చాక దళితులపై జరిగిన అత్యాచారాలు, దాడులపై ఇప్పటికైనా విచారణ జరిపిస్తారా అని అన్నారు. దళితులపై దాడుల్లో దక్షిణ బారతదేశం లోనే ఆంధ్రప్రదేశ్ ని మొదటి స్థానం కి తీసుకుని వచ్చి దళితులపై ఉక్కుపాదం మోపి మీ మేనమామ ని అంటూ తడిగుడ్డతో గొంతుకోసి ఇలా విగ్రహం పెడితే అన్ని మర్చిపోయి జేజేలు ఎలా కొట్టేస్తాం అంటూ ధ్వజమెత్తారు.