గంగాధర నెల్లూరు ( జనస్వరం ) : కార్వేటి నగరం మండలం, కార్వేటి నగరం పంచాయితీ, సిద్దగుంట గ్రామంలో జనం కోసం జనసేన భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ యుగంధర్ పొన్న పాల్గొని, భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను ఇంటింటికి వీల్ చైర్ లో ప్రయాణం చేస్తూ, ప్రతి కుటుంబాన్ని పరామర్శిస్తూ, ఆత్మీయంగా పలకరిస్తూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ శుద్ధగుంట గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేస్తామని వాగ్దానం చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ మాత్రమే మాత్రమే రాష్ట్రానికి మేలు చేస్తుందని, భోగిమంటల్లో వైసీపీకి చరమ గీతం పాడాలని తెలియజేశారు. ఆశ్చర్య మైన ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అపారమైన అనుభవశాలి చంద్రబాబు నాయుడని ఈ సందర్భంగా కొనియాడారు. వారి సమ్మేళనాత్మక కృషితో రాష్ట్రం సస్యశ్యామలం గ్యారెంటీ యని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, గ్రామీణ రహదారులు, మహిళా సాధికారత, ఉపాధి కల్పన, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, యువతను పారిశ్రామికవేత్తలుగా చేయడం, కులాలకతీతంగా, మతాలకతీతంగా, ప్రాంతీయ బేధం లేకుండా, సమానమైన అభివృద్ధి చేయగలిగిన శక్తిమంతులు పవన్ కళ్యాణ్ చంద్రబాబులు. అందుకే ఈ 2024 ఎన్నికలు అత్యంత చారిత్రాత్మకమైనవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదని తెలిపారు. జాగ్రత్తగా ఆలోచించి ఒక మనిషి ఒక విలువ, అదే ఒక ఓటు, ఆ ఓటుని జనసేన తెలుగుదేశం పార్టీలకు వేసి అఖండ మెజారిటీతో గెలిపించ వలసినదిగా, ఇటు నియోజకవర్గంలోనూ, అటు రాష్ట్రంలోనూ జనసేన తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని నియోజకవర్గంలో ఉన్న ప్రజలను, రాష్ట్రంలో ఉన్న ప్రజలను కోరుతున్నానని తెలిపారు. రాష్ట్రం సస్యశ్యామల మౌటమే కాకుండా, దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపే బాధ్యతను పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తీసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాన వీధుల్లో జై జనసేన, జై జై జనసేన, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం అంటూ నూతన ఉత్సాహంతో జేజేలు కొట్టడం గమనార్హం. గ్రామస్తులు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్వేటి నగర్ మండల ఉపాధ్యక్షులు విజయ్, కార్వేటినగరం టౌన్ కమిటీ అధ్యక్షులు రాజేష్, ఉపాధ్యక్షులు చిరంజీవి, కాపు యువసేన మండల అధ్యక్షులు వెంకటేష్, టౌన్ కమిటీ సీనియర్ నాయకులు రూప శేఖర్, చంద్ర, జిల్లా సంయుక్త కార్యదర్శి నరేష్, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతేశ్వర్ రెడ్డి, వెదురు కుప్పం మండల ప్రధాన కార్యదర్శి బెనర్జీ, గంగాధర్ నెల్లూరు మండలం ఉపాధ్యక్షులు గుణశేఖర్, కార్వేటినగరం టౌన్ కమిటీ కార్యదర్శి గజేంద్ర, జనసైనికులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.