నెల్లూరు ( జనస్వరం ) : వైసిపి ప్రభుత్వం నూతనంగా అమల్లోకి చెందిన తెచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు పరచాలంటూ గత నెల రోజులుగా న్యాయవాదులు చేస్తున్న సమ్మెకు జనసేన జిల్లా లీగల్ ఇంచార్జ్ చదలవాడ రాజేష్ ఆద్వర్యం లో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,అధికార ప్రతినిధి కారపూడి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు ఏటూరు రవికుమార్ గారు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న భూ హక్కు పథకం ద్వారా ప్రతీ ఒక్కరి ఆస్తి పత్రంపై జగన్ బొమ్మ, ప్రతీ పునాది రాయిపై జగన్ బొమ్మ పెట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చారు, అంతకు మించి ప్రజలకు ఉపయోగం లేదు. చాలా గ్రామాల్లో రీ సర్వే పేరిట ఒకరి భూమి మరొకరికి రాస్తున్నారు, కోర్టులకు దీనిపై విచారణ చేసే హక్కు లేకుండా రెవెన్యూ శాఖకు అధికారం బదిలీ చేశారు, దీనివలన ప్రజలు నష్ట పోతారు. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం… ఓ క్రూరమైన చట్టం. ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో పాలన జరగడం లేదు. న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించడానికి వీళ్లెవరు..? ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదార్ పుస్తకాల్లో, సర్వే రాళ్లలో సీఎం బొమ్మలు ఏమిటి? రాష్ట్రంలో ప్రజల ఆస్తులన్నీ పాలకుడి గుప్పిట ఉంచుకొనేందుకే కొత్త చట్టం భూ యాజమాన్య హక్కుల చట్టంలోని లోగుట్టు ఏమిటో సామాన్యుడికి అర్ధమయ్యేలా చైతన్యం తెస్తామని అన్నారు. నిస్వార్థంగా పోరాటం చేస్తున్న న్యాయవాదులకు జనసేన సంపూర్ణ మద్దతు అని తెలిపారు..