అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటమంతి కార్యక్రమంలో భాగంగా నాలుగవ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక రాజీవ్ నగర్ పంచాయితీకి సంబంధించిన ముత్యాలమ్మ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను ప్రజలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోయి పంచాయతీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వాటికి నిధులు కేటాయించకుండా పంచాయితీలలో మౌలిక సదుపాయాల కొరతకు కారణమయ్యాడని ప్రస్తుతం ఇక్కడ రాజీవ్ కాలనీ పంచాయతీలో పెద్ద ఎత్తున నీటి ఎద్దడి ఉందని అంటూ జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో లోని ముఖ్యమైన అంశాలను వివరిస్తూ దీపం పథకం కింద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15వేల రూపాయలు ఆర్థిక సహాయం మొదలగు మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందడానికి దోహదపడే పథకాలు ఉన్నాయని కనుక ప్రతి ఒక్కరూ జనసేన టిడిపి ఉమ్మడి పార్టీలకు ఓటు వేసి ప్రజా ప్రభుత్వ స్థాపనకు దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.