గాజువాక ( జనస్వరం ) : గాజువాక పట్టణంలో ఉన్న డిసైర్ అనాధ ఆశ్రమంలో ఉన్న అనాధ పిల్లలకు కొత్త బట్టలు పంపిణీ చేసారు. ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా అనాధ పిల్లల కళ్ళల్లో వెలుగులు నింపాలని, వారు సంతోషంగా పండుగ జరుపుకోవాలని కొత్త బట్టలు అందించామని అన్నారు. అడిగిన వెంటనే ఆర్థిక సహకారం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరుపున దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.